మేము ఓడి  గెలిచాం వాళ్ళు గెలిచి ఓడిపోయారు..

roja-rk-04.jpg

ఆ ఎన్నికల్లో మా ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని మాజీమంత్రి, వైఎస్ఆర్సీపీ నేత ఆర్కే రోజా అన్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక గత రెండు రోజులుగా ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వివాదంగా మారింది. ఎట్టకేలకు మంగళవారం జరిగిన ఎన్నికలో కూటమి అభ్యర్థి విజయం సాధించారు. దీనిపై రోజా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ కూటమి ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆమె తిరుపతి నగర పాలక సంస్థ ఉప మేయర్ ఎన్నికల్లో మా అభ్యర్థి ఓటమి ప్రజాస్వామ్య ఓటమి అని వ్యాఖ్యానించారు.

తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ అయిన డా.శిరీషని విధుల నిర్వహణలో అవమానించారని తెలిపారు. తిరుపతి మున్సిపల్ కార్పోరేషన్ సమావేశం లోపల జరుగుతుంటే బయట మేయర్ శిరీష ఆందోళన చేసే పరిస్థితి ఏర్పడటం దేనికి సంకేతం? అని ప్రశ్నించారు. అలాగే తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి ప్రయాణిస్తున్న బస్సు పై దాడి, నిన్న బస్సులో బయలు దేరిన వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేటర్లు నేడు రాకపోవడం, మాతో నిన్న వచ్చి నేడు మాకు వ్యతిరేకంగా ఓటు వేయడం నిన్న రాత్రి జరిగిన పరిణామాలకు కొనసాగింపు కాదా? అని మండిపడ్డారు.

Share this post

scroll to top