తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ బాబు ష్యూరిటీ- భవిష్యత్ కు గ్యారంటీ అని ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ బాబు ష్యూరిటీ మోసానికి గ్యారంటీ అని రుజువు అయిందని ఎద్దేవా చేశారు. బటన్ నొక్కడం గొప్పనా ముసలావిడ కూడా బటన్ నొక్కుతుందని గతంలో అన్నారు. కానీ, కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతుంది. హామీలు గ్యారంటీ అని ఇంటింటికీ బాండ్లు కూడా పంచారు. అమలు చేయకపోతే.. చొక్కాలు పట్టుకొని నిలదీయండి అని అన్నారు. ఇప్పుడు బాండ్లు, మేనిఫెస్టోలు ఏమయ్యాయి.. ఎవరి చొక్కాలు పట్టుకోవాలని జగన్ అడిగారు.
అలాగే, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి ప్రాజెక్టులు ఇప్పుడు కట్టాలంటే వేల కోట్లు అవుతుందని జగన్ అన్నారు. ఇప్పుడు అసలు సాధ్యం కూడా కాదు స్కాంలు చేస్తూ అమ్మకానికి పెట్టారు. 17 మెడికల్ కాలేజీలు కట్టడం మొదలు పెట్టాం. పెద్ద పెద్ద నగరాలు మనకు లేనందున మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ రావు. టీచింగ్ హాస్పిటల్ తో అనుసంధానం అయితే, చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అందుబాటులోకి వస్తుందని తేల్చి చెప్పారు. ప్రతి పార్లమెంట్ పరిధిలో ఒక మెడికల్ కాలేజీకి శ్రీకారం చుట్టాం ఐదు మెడికల్ కళాశాలలు ప్రారంభించాం మిగతా వాటి పనులు శరవేగంగా ముందుకు వెళ్తున్నాయి. ఇప్పుడు స్కాంలు చేస్తూ తమ వారికి అమ్ముకోవాలని చూస్తుంది ఈ కూటమి సర్కార్. మాకు మెడికల్ సీట్లు వద్దని కేంద్రానికి లేఖ రాసింది కూటమి ప్రభుత్వమే అని జగన్ ఆరోపించారు.