టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా, రాష్ట్రంలో వైసీపీ విజయాన్ని అడ్డుకోలేరని మంత్రి జోగి రమేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. బాబు ఎల్లో మీడియాకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్లారని జోగి రమేశ్ ప్రశ్నించారు. దోచుకున్న డబ్బును దాచుకునేందుకు దుబాయ్ వెళ్లారా? అని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పరారీతో టీడీపీ నేతల నోటికి తాళాలు పడ్డాయని ఎద్దేవా చేశారు.