ఒంగోలులో అసలేం జరుగుతోంది  జనసేనలో వర్గపోరు..  

janasena-07.jpg

అప్పుడెప్పుడో మొదలైన రచ్చ విభేదాలకు దారి తీసి వివాదంగా చెలరేగి ఇప్పుడు వర్గపోరుగా మారింది. ఏదో అనుకొని జనసేనలో చేరితే బాలినేనికి వరుస షాక్‌లు తగులుతున్నాయ్. లోకల్‌ నేతలు బాలినేని పేరు చెప్తేనే భగ్గుమంటున్నారు. అసలు ఒంగోలు జనసేనలో ఏం జరుగుతోంది. వర్గపోరుకు అసలు కారణం ఏంటి పవన్‌ దృష్టి పెట్టకపోతే పరిస్థితులు చేయి దాటే అవకాశం ఉందా పార్టీ ఓటమో లేదంటే అంతర్గత విభేధాలో కారణం ఏదైనా వైసీపీకి బైబై చెప్పిన బాలినేని జనసేన తీర్థం పుచ్చుకున్నారు. ఐతే ఆయన చేరినప్పటి నుంచి గాజు గ్లాసులో సెగలు రేగుతున్నాయ్. ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు రియాజ్‌కు, బాలినేని మధ్య దూరం పెరిగిపోతోంది. దీంతో జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరింది.

బాలినేని చేరికపై మొదటి నుంచి రగిలిపోతున్న రియాజ్‌ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. నిజానికి బాలినేని పార్టీలోకి రావడం రియాజ్‌కు ఇష్టం లేదట. బాలినేనిని పార్టీలోకి రాకుండా అడ్డుకునేందుకు విశ్వప్రయత్నం చేశాడు. బాలినేని పార్టీలోకి రావడం ఆయనకు మింగుడు పడడం లేదు. పార్టీలో చేరినా నాటి నుంచి ఇద్దరు నేతలు ఉప్పు నిప్పులా ఉండిపోయారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్.

Share this post

scroll to top