కేటీఆర్ నీ ఎకిలి చేష్టల వల్లే బీఆర్ఎస్ కుప్పకూలిందని సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ పార్టీ నేత బుద్ధా వెంకన్న. ఇవాళ మీడియాతో బుద్ధా వెంకన్న మాట్లాడారు. చంద్రబాబుపై ఎకిలిగా మాట్లాడడమే బీఆర్ఎస్ పార్టీ పతనానికి కారణం అని చంద్రబాబును అరెస్ట్ చేస్తే వంద దేశాల్లో పైగా నిరసనలు చేశారని తెలిపారు. మీకు తెలంగాణలోనే దిక్కు లేదు ఏపీ గురించి ఎందుకు? అంటూ బుద్ధా వెంకన్న చురకలు అంటించారు. ఇక అటు ఎమ్మెల్సీ తనకు రాకపోవటం పై మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న రియాక్ట్ అయ్యారు. చంద్రబాబు నాకు దేవుడు నేను ఆయన భక్తుడిని అంటూ వ్యాఖ్యానించారు. దేవుడు కూడా అప్పుడప్పుడు పరీక్ష పెడతాడని తెలిపారు. నాకు పదవి వచ్చినా రాకపోయినా అంకిత భావంతో పనిచేస్తానని తెలిపారు. రాజకీయాల్లో పదవి అనేది ఒక క్రీడ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకోసారి పదవి వస్తుంది ఒక్కో సారి రాదు ఏ సందర్భం లో నైనా నేను ఒకేలా ఉంటానని ప్రక టించారు మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న.
మాతో పెట్టుకుంటే మాడి మాసైపోతారు..
