2 ల‌క్ష‌ల పెన్షన్లు తొలగించడం అన్యాయం..

trimurthulu-13-.jpg

ఎన్నిక‌ల్లో కూట‌మికి ఓటు వేయ‌లేద‌ని క‌క్ష‌గ‌ట్టి సామాజిక పింఛ‌న్లు తొల‌గించార‌ని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ర‌మేష్ యాద‌వ్ తెలిపారు. తొమ్మిది నెల‌ల్లో రెండు లక్షల పెన్షన్లు తొలగించి, రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెప్ప‌డం స‌రికాద‌న్నారు.  ఏ ప్రాతిపదికన పెన్షన్ల తొలగిస్తున్నారో చెప్పాల‌ని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ స‌భ‌లో ప‌ట్టుబ‌ట్టారు. గతంలో 6 అంశాల పై పింఛన్లు వెరిఫై చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకుని వెరిఫై చేస్తున్నార‌ని త‌ప్పుప‌ట్టారు. పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నార‌ని, సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెలరోజుల సమయం పడుతుంద‌న్నారు. ఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు. చిరునామా మారితే పెన్షన్ తొలగించేస్తున్నార‌ని ఆక్షేపించారు. పెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాల‌ని అరుణ్‌కుమార్  కోరారు. 

Share this post

scroll to top