హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొడుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరు హోలీ వేడుకల్లో మునిగి తేలుతున్నారు. గల్లీ గల్లీలో హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయి. పలు చోట్ల హోలీ ఈవెంట్స్ సైతం ఏర్పాటు చేశారు. డీజే సాంగ్స్ తో, రెయిన్ డ్యాన్స్ తో కుర్రకారు జోరు ఉర్రూతలు ఊగుతున్నారు. ఈసారి యూత్ హోలీని మరింత కలర్ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.
హైదరాబాద్ లో అంబరాన్నంటిన హోలీ సంబరాలు..
