వైసీపీ కి, ఎమ్మెల్సీ సభ్యత్వానికి మర్రి రాజశేఖర్ రాజీనామా చేసిన విషయం అందరికీ విదితమే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి విడదల రజిని మర్రి రాజీనామాపై తాజాగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆమె చిలకలూరిపేట లో మాట్లాడుతూ రాజీనామా చేసిన మర్రి రాజశేఖర్ ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని అన్నారు. వ్యక్తిగతంగా మాజీ సీఎం జగన్ వైఎస్ కుటుంబం ఆయనకు సముచిత గౌరవం ఇచ్చిందని తెలిపారు. పార్టీలో ఎక్కడా ఆయన గౌరవానికి భంగం వాటిల్లేలా ఎలాంటి పనులు కూడా చేయలేదన్నారు. మర్రి గెలుపు కోసం వైఎస్ జగన్ కూడా ప్రచారం చేశారని, రెడ్ బుక్ పాలనలో తన వాయిస్ వినిపించే ఉంటే ఆయన గౌరవం మరింత పెరిగి ఉండదేని అన్నారు. జగన్ చెబితేనే తాను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేశానని, తిరిగి ఆయన పంపితేనే చిలకలూరిపేట వచ్చానని కామెంట్ చేశారు. తమ అధినేత ఆదేశాలను పాటించడమే తనకు తెలుసని రజిని స్పష్టం చేశారు.
మర్రి రాజశేఖర్ రాజీనామాపై విడదల రజని కౌంటర్..
