మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం గ్యారెంటీ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర షాప్ చైర్మన్ రవికుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆడదామా ఆంధ్రాలో 119 కోట్ల గోల్మాల్ జరిగిందని ఆయన ఆరోపణలు చేశారు. టూరిజం లో అక్రమాలు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్లాక్ టికెట్ల దందా కూడా చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని మాజీ మంత్రి రోజాకు వార్నింగ్ ఇచ్చారు రవి నాయుడు. రోజాకు భయంతో చెమటలు పడుతున్నాయని కూడా కౌంటర్ ఇచ్చారు. ఏ క్షణమైనా మాజీ మంత్రి రోజా అరెస్ట్ కావడం గ్యారెంటీ అంటూ హెచ్చరికలు జారీ చేశారు రవి నాయుడు. మరి రవి నాయుడు చేసిన కామెంట్లపై రోజా ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
రోజా అరెస్టు కావడం ఖాయం..
