హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షం మళ్లీ మొదలైంది. నిన్న అర్ధరాత్రి తెలంగాణ వ్యాప్తంగా వర్షం పడగా ఇప్పుడు మళ్లీ హైదరాబాద్ లో మొదలైంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. సాయంత్రం నాలుగు కాగానే కారు మబ్బులు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరికొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కూడా పడుతోంది. మాదాపూర్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, జూబ్లీహిల్స్, పంజాగుట్ట ప్రాంతాలలో వర్షం దంచి కొడుతోంది. దీంతో వాహనదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షం పడడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు ట్రాఫిక్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.
హైదరాబాద్‌లో వడగళ్ల వాన..
