రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం కోస్తా, రాయలసీమలో పలుచోట్ల పిడుగులు, ఈదురుగాలులతో కురిసిన వర్షాలు కురిశాయి. రాత్రి 8 గంటల వరకు అనకాపల్లి జిల్లా చీడికాడలో 425, తిరుపతి జిల్లా పూలతోటలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక గురువారం కూడా చిత్తూరు, తిరుపతి, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్గాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. ఓవైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం కర్నూలులో 40.7, నంద్యాల జిల్లా గోస్పాడు, శ్రీసత్య సాయి జిల్లా కనగానపల్లిలో 40.4 డిగ్రీల మేర పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనాయి.
నేడు రేపు చిరుజల్లులు..
