ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో రాహుల్ గాంధీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా కాంగ్రెస్ నాయకులు స్వాగతం పలికారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న భారత్ సమ్మిట్ 2025 కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు ఘనంగా చేసింది. భారత్ సమ్మిట్ కార్యక్రమానికి దాదాపు 100 దేశాలకు పైగా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు హాజరయ్యారు.
ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ దేశాల ప్రతినిధులను కోరనుంది. అయితే ఈ భారత్ సమ్మిట్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చారు. శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ కు తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతలు వెల్ కమ్ చెప్పారు. వీరంతా ఎయిర్ పోర్టు నుంచి రోడ్డు మార్గం ద్వారా హైటెక్ సిటీకి బయలు దేరారు. అనంతరం రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేతలతో కలిసి భారత్ సమ్మిట్ లో పాల్గొని ప్రసంగించనున్నారు.