సెగలు పుట్టిస్తున్న హన్సిక..

hansika-26.jpg

అందాల ముద్దుగుమ్మ హన్సిక గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ బ్యూటీ సొంతం. ఒకప్పుడు వరస సినిమాలతో యూత్ ను మాయ చేసింది ఈ చిన్నది. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాల్లో నటించి అందరిచేత మన్ననలు పొందింది. బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో తన నటన, గ్లామర్ తో అందరినీ ఆకట్టుకుంది.తర్వాత అల్లు అర్జున్ నటించిన దేశముదురు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో ఈ అమ్మడు అందానికి ప్రతి ఒక్కరూ ఫిదా అయిపోయారనే చెప్పాలి.

దేశముదురు సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు వరసగా అవకాశాలు క్యూ కట్టాయి. వరసగా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే తన నటనతో, అందంతో క్రేజీ బ్యూటీగా మంచి ఫేమ్ సంపాదించుకుంది. తెలుగులోనే కాకుండా, తమిళం, హిందీ, కన్నడ వంటి భాషల్లో నటించి మంచి ఫ్యాన్ బేస్ సొంతం చేసుకుంది. తర్వాత కొన్ని రోజుల పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ చిన్నది మళ్లీ బుల్లితెరపై కనిపించి సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు గోల్డ్ కలర్ డ్రెస్ లో తన హాట్ అందాలతో కుర్రకారును మాయ చేస్తుంది. స్టైలిష్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Share this post

scroll to top