మేడే సంధర్భంగా చెన్నైలో జరిగిన దక్షిణ భారత సినీకార్మికుల సమ్మేళనం కార్యక్రమంలో ముఖ్యఅతిధిగా పాల్గొన్న రోజా ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆర్.కె.రోజా గారు మాట్లాడుతూ తాను ఈ స్థాయికి ఎదగడానికి ముఖ్య కారణమైన సినీకార్మికులు, దర్శక నిర్మాత లను ఎప్పటికీ మరచిపోనని అన్నారు. సినీ ఫీల్డుకు వచ్చిన కొత్తలో నా మేకప్ మేన్లు, కాస్టూమ్ డిజైనర్లు, కో డైరక్టలు, చిన్న చిన్న కార్మికులు సైతం నాకెంతో సహకరించి నన్నెంతగానో తీర్చి దిద్దారని నేను ధైర్యంగా సినీరంగంలో కొనసాగడానికి సహకరించారని కొనియాడారు.
వారి సహకారంతో సినీ రంగంలో సక్సస్ కావడం వల్లే ఈరోజు రాజకీయరంగంలో కూడా నిలదొక్కుకో గలిగానని అన్నారు. ఈ సంధర్భంగా ఆమె సినీ కార్మికుల కోసం తాను ఉడుతాభక్తిగా 5 లక్షల రూపాయల చిన్న సహాయాన్ని విరాళంగా అందిస్తున్నానని ప్రకటించారు. కార్మికులందరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కాంక్షిస్తూ వారికి సభాముఖంగా మేడే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సినీ రంగానికి సేవలందించి పలువురు కార్మికులు ప్రముఖులను సభాముఖంగా సన్మానించారు.