యానిమల్ సినిమాతో పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ఓ పవర్ పోలీస్ యాక్షన్ డ్రామాను రూపొందించనున్నారు. ఇందులో ప్రభాస్ పోలీస్ అవతారంలో కనిపించనున్నారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి కొన్ని రూమర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ స్పిరిట్ సినిమా కాకుండా ప్రశాంత్ వర్మతో చేయబోయే సినిమాలో జాయిన్ అవుతాడని అంటున్నారు. మరోవైపు స్పిరిట్ కంటే ముందు యానిమల్ పార్క్ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించనున్నారని టాక్. అయితే తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు స్పిరిట్ మూవీ నిర్మాత.
సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా చేసిన తర్వాత యానిమల్ పార్క్ మూవీ తెరకెక్కిస్తాడని అన్నారు. మరో రెండు మూడు నెలల్లో స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలిపారు. 2027లో ఈ సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. నిర్మాత భూషన్ కుమార్ ప్రకటనతో ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ప్రస్తుతం ఇటలీలో ఉన్న ప్రభాస్ ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత రాజాసాబ్ మూవీ కంప్లీట్ చేయనున్నారు. ఆ తర్వాత స్పిరిట్ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది.