ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ అమరావతి.. 

cbn-02-2.jpg

అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అమరావతిని మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. అప్పుడు ప్రధాని మోడీని మళ్లీ ఆహ్వానిస్తామని చెప్పారు. రూ.57,980 కోట్ల ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయి. మోడీ గైడెన్స్‌తో అమరావతిని ప్రపంచం మెచ్చే రాజధానిగా తయారు చేస్తాం అమరావతి 5 కోట్ల మంది ప్రజల సెంటిమెంట్ 5 లక్షల మంది అమరావతిలో చదువుకునే అవకాశం ఉంటుంది. అమరావతిని హెల్త్, ఎడ్యుకేషనల్ హబ్‌గా చేస్తాం అమరావతిని పర్యావరణహితంగా తయారు చేస్తాం బిట్స్ పిలానీ, టాటా ఇన్నోవేషన్ హాబ్ లాంటి సంస్థలు ఇక్కడికి వస్తాయి. అని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.

కేంద్రం తీసుకున్న కులగణన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం 2024 ఎన్నికల్లో నేను, పవన్ కళ్యాణ్ కలిసి పని చేసి 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించాం ఇప్పుడు కేంద్రం ఇచ్చిన ఆసరాతో ఏపీ అభివృద్ధిలో ముందుకు వెళ్తుంది. కేంద్రం సహకారంతో అమరావతిని మళ్లీ పట్టాలెక్కిస్తున్నాం 34 వేల ఎకరాల భూమిని రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అమరావతి రైతులు వీరోచితంగా పోరాడారు, ఇది వాళ్ల విజయం. అమరావతి రైతులు చేసిన ఉద్యమం లాంటి ఉద్యమాన్ని ఇంత వరకు నేను ఎప్పుడూ చూడలేదు.” అని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

Share this post

scroll to top