అమరావతి రీలాంచ్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన పది సంవత్సరాలకు రాజధాని నిర్మాణానికి పునాదిరాయి వేశారు. అయితే, గత ఐదు సంవత్సరాలు అమరావతి పనులు ఆగిపోయినందుకు ప్రధాని నరేంద్ర మోడీయే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. దేశంలో కొత్త రాజధాని నిర్మాణానికి కేంద్రం నిధులు ఇవ్వాల్సింది. అలా ఇవ్వకుండా అప్పు ఇప్పించడం ఎంతవరకు సమంజసం అని నిలదీశారు. అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రధాని మోడీ ప్రత్యేక హోదా మాట ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు నారాయణ. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కుల గణన చేయడాన్ని సీపీఐ స్వాగతిస్తోందన్నారు నారాయణ. 2029 కల్లా కుల గణన పూర్తిచేసి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలన్నారు.
అమరావతి రీలాంచ్‌పై సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు..
