తల్లి కాబోతున్న మెగా కోడలు..

varun-06.jpg

టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్‌ ను ప్రేమించింది. కొద్ది కాలంపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు పెద్దలను ఒప్పించి 2023లో ఇటలీలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్నారు. పెళ్లి తర్వాత రెగ్యులర్‌గా వెకేషన్స్‌ను వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈక్రమంలోనే లావణ్య తల్లి కాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. గత కొద్ది రోజులను సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తాజాగా, లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఈ విషయంపై ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. వారిద్దరు తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిన్ని షూస్‌తో పాటు వరుణ్, లావణ్య కలిసి చేతులు పట్టుకున్న ఫొటోను షేర్ చేశారు. అంతేకాకుండా జీవితంలో అత్యంత బెస్ట్ మూమెంట్ త్వరలో రాబోతుంది అనే క్యాప్షన్ పెట్ట రెడ్ హార్ట్ సింబల్స్ జత చేశారు. ప్రస్తుతం వీరిద్దరి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన వారంతా మెగా కపుల్‌కు కంగ్రాట్స్ చెబుతున్నారు. నెటిజన్లతో పాటు సినీ సెలబ్రిటీలు సైతం శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టులు పెడుతున్నారు.

Share this post

scroll to top