ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డు విధానాన్ని ఆధునీకరిస్తోంది. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఇకపై రేషన్ కార్డులను స్మార్ట్ కార్డు తరహాలో జారీ చేయనున్నారు. కొత్త రేషన్ కార్డుల్లో QR కోడ్ అమర్చబడి ఉంటుంది. దాన్ని స్కాన్ చేయడం ద్వారా కార్డు హోల్డర్‌కు సంబంధించిన అన్ని వివరాలు తక్షణమే తెలుసుకోవచ్చు. వేరే ప్రాంతాలకు వలస వెళ్లే వారు తమ రేషన్ కార్డులను ప్రభుత్వానికి స్వచ్ఛందంగా సరెండర్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు. ఈ ప్రక్రియను గ్రామ వార్డు సచివాలయాల ద్వారా నిర్వహించనున్నారు. అర్హత కలిగిన నూతన దరఖాస్తుదారులు అక్కడే తమ వివరాలు నమోదు చేసుకోవచ్చు.
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్..
