యుద్ధానికి సిద్ధమైన పాక్..

pak-07.jpg

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్, బుధవారం తెల్లవారుజాము ఆపరేషన్ సింధూర్ పేరుతో పీఓకే, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నామరూపాలు లేకుండా చేసింది. ఈ దాడుల్లో సుమారుగా 80 మంది వరకు ఉగ్రవాదులు మరణించినట్లు సమాచారం. భారత్ జరిపిన దాడిలో ఒక్కసారిగా పాకిస్తాన్ షాక్‌కి గురైంది. ఇదిలా ఉంటే, ఈ దాడులపై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆర్మీ, ఇతర ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాలు నిర్వహించారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం, ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వం సైనిక దళాలను కోరింది.

భారత సైనిక చర్యకు ప్రతిస్పందనగా, పాకిస్తాన్ భారతీయ దౌత్యవేత్తను పిలిచి, నిరసన తెలియజేసింది. భారత దాడులకు ప్రతీకారం తీర్చుకునే హక్కు పాకిస్తాన్‌కి ఉందని ఆ దేశ సమాచార మంత్రి అతుల్లా తరార్ తీవ్రంగా స్పందించారు. ఇదిలా ఉంటే, భారత ఆపరేషన్ సింధూర్ కి ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ సైన్యాన్ని పీఎం షెహబాజ్ షరీఫ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో భారత్‌పై పాకిస్తాన్ దాడి చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో, పాక్ పీఎం ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడనున్నారు. దేశ భద్రత, పాక్ ఆర్మీ తీసుకుంటున్న చర్యల్ని ప్రజలకు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top