ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలు లైన్‌లో పెట్టిన విషయం తెలిసిందే. ఇటు యంగ్ హీరోలకు సైతం పోటీ ఇస్తూ తనదైన శైలిలో ప్రాజెక్టులను పట్టా లెక్కిస్తున్నారు. ఇక ఈ లిస్ట్ లో ‘బింబిసార’ డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ మూవీ ముగింపు దశకు చేరుకోగా, ఈ ఏడాదిలోనే సమ్మర్ కానుకగా విడుదల కానుంది. అలానే మరోవైపు అనిల్ రావిపూడితో సినిమాను రీసెంట్ గానే స్టార్ట్ చేశారు చిరు. ఆ తర్వాత దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలాతో మూవీ చేయనున్నారు. ఇది చిరంజీవి 158వ చిత్రంగా రాబోతుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ వార్త వైరల్ అవుతుంది.
చిరుతో సినిమా అంటే మాములు విషయం కాదు. అందుకే శ్రీకాంత్ ఈ చిత్రం కోసం గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కబోయే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ భామలను రంగంలోకి దించేందుకు ప్లాన్ చేస్తున్నారట. నాని నిర్మతగా వ్యావహరిస్తున్నా ఈ మూవీలో బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రాణీ ముఖర్జీ నటించనున్నట్టు టాక్ వినిపించింది. అయితే ఇప్పుడు ఆమె ప్లేస్ లో దీపికా పదుకొనేను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్టు సమచారం. ప్రభాస్ ‘కల్కి’ మూవీలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైనా దీపిక మరి చిరంజీవి కోసం ఈ సినిమాను ఓకే చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. ఎందుకంటే ప్రజంట్ ఈ అమ్మడు చేతిలో కూడా వరుస చిత్రాలు ఉన్నాయి.