జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులకు హైకోర్టులో ఊరట..

high-court-08.jpg

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముంబై నటి ఝాన్సీ జెత్వానీ అక్రమ అరెస్ట్ కేసు సంచలనంగా మారింది. ఈ కేసు రాజకీయ, పోలీసు వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో నటి జెత్వానీని ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ అరెస్టు కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జరిగింది. జెత్వానీని ఐదు రోజుల పాటు విజయవాడలోని కంట్రోల్ రూమ్‌లో అక్రమంగా నిర్బంధించి, విచారించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విచారణలో సమయంలో చట్టవిరుద్ధమైన పద్ధతులు అవలంబించి నట్లు ఆమె కూటమి ప్రభుత్వంలో పోలీసులను ఆశ్రయించగా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అనంతరం సీఐడీ అధికారులు విచారణ జరిపి ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్ అధికారులు కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ, ప్రధానంగా వ్యవహరించినట్లు గుర్తించారు.

ఈ కేసులో పీఎస్ఆర్ ఆంజనేయులు కీలకంగా మారగా ఆయనను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. దీంతో అతనికి 2025 మే 21 వరకు రిమాండ్ విధించింది. కాగా ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ‌లను విచారించేందుకు సీఐడీ అధికారులు వారికి మే 5న విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలో వారు ఏపీ హైకోర్టును ఆశ్రయించగా ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో సీఐడీ దాఖలు చేసిన అఫిడవిట్‌లో, ఐపీఎస్ అధికారులకు బెయిల్ ఇవ్వవద్దని, వారిని కస్టోడియల్ ఇంటరాగేషన్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అయినపప్పటికి నటి జెత్వానీ కేసులో ఐపీఎస్ అధికారులైన కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని గురువారం ఏపీ హైకోర్టు ఆదేశించింది.

Share this post

scroll to top