అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. దక్షిణ అండమాన్, నీకొబార్ దీవుల్లో ఋతుపవనాలు కేంద్రికృతం అయినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి మరింత విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని, మూడు, నాలుగు రోజుల్లో మధ్య బంగాలా ఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళకు తాకనున్నాయని వెల్లడించారు. అయితే ఈ సారి వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో మధ్య బంగాళా ఖాతంలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయని, ఈ నెలాఖరుకు కేరళ తీరని రుతుపవనలు తాకుతాయన్నారు. ఆ తర్వాత ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయన్నారు. రాబోయే వారం రోజుల్లో ఏపీలో చెదురు మదురు వర్షాలు ఉత్తరకొస్తాలో ఒకటి చెట్ల భారీ వర్షాలు కోస్తాలో ఉరుములు, మెరుపులు ఈదురుగాలితో కూడిన వర్షాలు ఉంటాయని జగన్నాధకుమార్ తెలిపారు.
అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు..
