పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..

helth-14.jpg

ప‌సుపు, తేనె మిశ్రమం జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో బాగా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. ఈ మిశ్రమం స‌హ‌జ‌సిద్ధమైన లాక్సేటివ్ ఏజెంట్‌గా పనిచేస్తుందట. ఇది సుఖ విరోచనానికి దోహదపడుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలైనా కడుపుబ్బరం, గ్యాస్‌ వంటి సమస్యలను దూరం చేస్తుంది. పసుపు తేనెలో విటమిన్‌ ఏ ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఫ్రీ ర్యాడిక‌ల్స్‌ను నాశ‌నం చేస్తాయి, క‌ణాల‌ను ర‌క్షిస్తాయి. ప‌సుపు, తేనె క‌లిపి తీసుకోవ‌డం వ‌ల్ల ఇన్‌ఫెక్షన్లు సైతం త‌గ్గుతాయి. అలాగే సీజనల్‌ వ్యాధులైన ద‌గ్గు, జ‌లుబు నుంచి ఉపశమనం కల్పించడంలో బాగా ఉపయోగపడుతుంది.

ఒక గ్లాస్ వాటర్‌లో తగినంత పసుపు , తేనె కలిపి తాగాలి. ఈ మిశ్రమం చర్మాన్ని లోపల నుంచి శుభ్రపరిచి ప్రకాశవంతంగా చేస్తుంది. లోపల నుంచి జరిగే డీటాక్సిఫికేషన్‌ వల్ల ముడతలు, మొటిమలు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఈ కషాయంలో జీవక్రియ వేగాన్ని పెంచే గుణం ఉంది. ఆకలి నియంత్రణలో ఉంచి, బరువు తగ్గడంలో సహాయపడుతుంది. పసుపు, తేనె వేర్వేరుగా ఒకదానికొకటి అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి. అలాంటి వాటిని కలిపి తీసుకున్నప్పుడు అది శరీరానికి రెండు రెట్లు లాభం చేస్తుంది. ప్రతి రోజు ఉదయం దీన్ని తీసుకునే అలవాటు చేసుకుంటే కేవలం 15 రోజుల్లోనే మీ శరీరంలో తేడా కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

Share this post

scroll to top