నరాలు తెగే హైప్ ఇచ్చిన హృతిక్ రోషన్..

ntr-16.jpg

మ్యాన్స్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. దేవర సినిమా సక్సెస్ తో ఫుల్ జేష్ మీదనున్న తారక్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో పాటు బాలీవుడ్ ఓ సినిమా చేస్తున్నాడు. వార్ 2లో ఎన్టీఆర్ నటిస్తున్న విషయం తెలిసిందే.. ఎన్టీఆర్ మొదటిసారి బాలీవుడ్ సినిమాలో నటించనుండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వచ్చిన వార్ సినిమాలో హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించారు. ఇక ఇప్పుడు హృతిక్ తో కలిసి తారక్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చాలా వరకు పూర్తయ్యిందని తెలుస్తుంది. అంతే కాదు ఇటీవలే ఈ సినిమాలో అదిరిపోయే సాంగ్ షూట్ జరిగింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ రోల్‌లో కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ రోల్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని అంటున్నారు. అలాగే ఎన్టీఆర్ లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుందని టాక్ వినిపిస్తుంది.

ఈ సినిమా షూటింగ్ సైలెంట్ గా జరుగుతుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు స్టార్ హీరో హృతిక్ రోషన్. ఈమేరకు హృతిక్ రోషన్ ఓ ట్వీట్ చేశారు. ఈనెల 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు ఈ సందర్భంగా వార్ 2 నుంచి క్రేజీ అప్డేట్ రానుందని తెలుస్తుంది. హృతిక్ ట్వీట్ చేస్తూ హేయ్  తారక్ నీ పుట్టిన రోజుకు నీ పుట్టిన రోజున నువ్వు ఊహించనిది రెడీగా ఉంది. అంటూ హృతిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంచనాలు ఆకాశానికి చేరాయి. వార్ 2 నుంచి ఎలాంటి అప్డేట్ ఇస్తారా అని ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ పుట్టిన రోజున సోషల్ మీడియాను షేక్ చేయడానికి అభిమానులు రెడీ అవుతున్నారు. అదే రోజు దేవర 2, డ్రాగన్ మూవీ అప్డేట్స్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Share this post

scroll to top