ఏం తిన్న అసిడిటీ వదలడం లేదా..

acidit-16.jpg

మారిన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల కారణంగా చాలా మంది ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఎసిడిటీ సమస్య ఉంటే బ్లోటింగ్, గొంతులో నొప్పి, ఛాతీలో నొప్పి, మంట వంటి ఇబ్బందులు వేధిస్తుంటాయి. ఎసిడిటీ సమస్య నుంచి బయిటపడేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే, ఎసిడిటీ సమస్య రాకుండా కొన్ని సింపుల్ టిప్స్‌ పాటిస్తే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. దాంతో పాటు సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు కూడా కొన్ని ఇంటి చిట్కాలు అద్భుత పరిష్కారం చూపుతాయని చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

సబ్జా గింజలను రోజూ నీటిలో నానబెట్టి తాగితే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు సబ్జా విత్తనాల నీటిని తాగడం వల్ల ఎన్నో రకాల పొట్ట సమస్యలనుంచి ఉపశమనం పొందవచ్చు. సబ్జా గింజల నీటిని తాగడం వల్ల మలబద్ధకం సమస్య నుంచి కూడా సులభంగా విముక్తి కలుగుతుంది. అలాగే సబ్జా గింజల నీటిని తాగడం వల్ల వివిధ రకాల కారణాలవల్ల వస్తున్న అసిడిటీ సమస్యకి కూడా శాశ్వత పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సబ్జా గింజల్లో లభించే ఎన్నో రకాల అద్భుతమైన గుణాలు గ్యాస్టిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం అందిస్తాయి. ఒక గ్లాసు సబ్జా గింజల నీటిలో ఐరన్ 2.27 మి.గ్రా, మెగ్నీషియం 31.55 మి.గ్రా, జింక్ 1.58 మి.గ్రా లభిస్తుంది. ఇదే కాకుండా సబ్జా గింజల నీటిని ఉదయాన్నే తాగితే శరీరానికి కాల్షియంతో పాటు కాల్షియం, భాస్వరం, మాంగనీస్, రాగి, పొటాషియం కూడా పుష్కలంగా లభిస్తాయి. నానబెట్టిన సబ్జా నీటిని తాగడం వల్ల శరీరానికి విటమిన్ సి, ఫోలెట్ (విటమిన్ B9), విటమిన్ ఇ, విటమిన్ కె, కొన్ని B విటమిన్లు అందుతాయి.

Share this post

scroll to top