నిబంధనలతో తల్లికి వందనం ఇస్తారా..

nara-20.jpg

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోగానే తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ఇప్పటి కే పలు మార్లు స్పష్టం చేసింది. అయితే, తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలతో ఈ పథకం అమలు విషయంలో కొత్త చర్చ మొదలైంది. చంద్రబాబు శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార భరోసా విడుదల సమయంలో తల్లికి వందనం పై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేసారు. ఎంత మంది పిల్లలు ఉంటే అందరికీ పథకం అమలు చేస్తామని మరో సారి స్పష్టం చేసారు. విద్యా సంవత్సరం ప్రారంభం లోగా ఇస్తామని చెబుతూనే ఒక ఇన్ స్టాల్ మెంటా లేక ఎలా ఇవ్వాలనేది ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. దీంతో, ఒకే విడతలో రూ 15 వేలు చెల్లిస్తారా రెండు విడతలుగా రూ 7500 చొప్పున చెల్లించే ఆలోచన చేస్తున్నారా అనే చర్చ మొదలైంది.

ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించిన లబ్దిదారుల సంఖ్య కావాల్సిన నిధుల పైన ఒక అంచనాకు వచ్చారు. ఇదే నెలలో అన్నదాత సుఖీభవ తొలి విడత నిధులను విడుదల చేయాల్సి ఉండటంతో ఇనిస్టాల్ మెంట్ అంశం తెర పైకి వచ్చినట్లు కనిపిస్తోంది. దీని పైన నేటి మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఇక, 2024-25 విద్యాసంవత్సరంలో రాష్ట్రంలో దాదాపు 81 లక్షల మంది విద్యార్ధులు చదువు తున్నారు. అయితే ఇందులో ప్రాధమికం గా 69.16లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా విద్యా శాఖ తేల్చిన్నట్లు సమాచారం. ఇదే సమయం లో విద్యార్ధులకు 75 శాతం హాజరు నిబంధన కొనసాగనుంది. ఆదాయ పన్ను చెల్లింపు దారులు తెల్లరేషన్‌ కార్డు లేనివారిని, 300 యూనిట్ల విద్యుత్‌ వినియోగించేవారిని, కారు కలిగి ఉన్న వారిని, అర్బన్‌ ప్రాంతంలో 1000 చదరపు అడుగులు కలిగి ఉన్నవారికి పథకం అందటం లేదు. ఇక, ఇప్పుడు కొత్త నిబంధనలను అధికారికంగా ఖరారు చేయాల్సి ఉంది.

Share this post

scroll to top