టీడీపీ అధిష్టానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరికలు జారీ చేశారు. అర్హత లేని వారికి పదవులు ఇస్తే వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వము, పార్టీకి మొదటి నుండి నమ్మకంగా పనిచేసిన వారికే పదవులు ఇవ్వాలన స్టేట్మెంట్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ. ఈ నెల చివర్లో జరగనున్న టీడీపీ మహానాడు కార్యక్రమ సందర్భంగా ఆళ్లగడ్డలో నిర్వహిస్తున్న టీడీపీ మినీ మహానాడుకు ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో తన ప్రత్యర్దులకు పదవులు ఇస్తున్నారని, ఇది మంచి పద్ధతి కాదని అధిష్టానంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే తనకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్న అధిష్టానంతో పాటు పదవులు తీసుకుంటున్న తన ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అర్హత లేని వారికి పదవులు ఇస్తే వారిని ఊర్లో అడుగుపెట్టనివ్వమని, పార్టీకి మొదటి నుంచి నమ్మకంగా పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలని, టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధిష్ఠానానికి అల్టిమేటం జారీ చేశారు.
టీడీపీ అధిష్టానికి ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక..
