అన్నదాతకు వైయస్ఆర్సీపీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారి తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం పొడగట్లపల్లికి చెందిన రైతు మెర్ల సత్యనారాయణ కలిశారు.
గతంలో వైయస్ జగన్ ప్రభుత్వంలో అన్నదాతకు అండగా నిలిచి, మద్దతు ధర కల్పించి ధాన్యం కొనుగోళ్ళు చేసేవారని, కూటమి ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం అందకపోగా ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనుగోలు చేయకపోవడంతో అన్నదాత రోడ్డెక్కి ఆందోళనలు చేయాల్సి వస్తుందని వైయస్ జగన్కు వివరించిన రైతు మెర్ల సత్యనారాయణ, ప్రభుత్వం నుంచి ఎలాంటి చేయూత లేకపోయినా తమ ప్రాంతంలో రైతులు ఎకరాకు 55-60 బస్తాల ధాన్యం పండించారని, కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ళు నిలిపివేయడంతో రైతులంతా ఆందోళనలు, నిరసనలు చేసినా ప్రభుత్వంలో చలనం లేదని వాపోయిన సత్యనారాయణ. అంతేకాక ప్రభుత్వం కొనుగోళ్ళు చేయకపోవడంతో ఇటీవల కురుస్తున్న వర్షాలకు కళ్ళాల్లోనే ధాన్యం తడిచిపోయిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన వైయస్ జగన్ అండగా ఉంటామని హామీ ఇచ్చారు.