ఎవరి హయాంలో మద్యం అమ్మకాలు పెరిగాయి, తగ్గాయని, ఎవరు ఎవరికి లంచం ఇస్తారని జగన్ ప్రశ్నించారు. చివరకు చంద్రబాబు అండ్ కో 2022లో కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో కేసు వేశారని, కొన్ని బ్రాండ్లను తొక్కిపెట్టానని ఆరోపణలు చేశారని, వీటిపై సుదీర్ఘ విచారణ జరిపిన కమిషన్ 2002 నాటి కాంపిటీషన్ చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదని తీర్పు ఇచ్చిందన్నారు. వైసీపీ ప్రభుత్వం మార్కెట్లోకి రాకుండా ఎవరినీ అడ్డుకోలేదని కమిషన్ స్పష్టం చేసిందన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే తప్పు చేసిన చంద్రబాబు తమపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.
రాజ్యసభ సభ్యుడిగా మూడున్నరేళ్ల పదవీకాలం వద్దనుకుని చంద్రబాబుకు మేలు చేసేందుకు పదవి వదులుకుతున్న వ్యక్తి విజయసాయిరెడ్డి అన్నారు. తన రాజీనామాతో చంద్రబాబు కూటమికి మేలు జరుగుతుందని తెలిసీ తన పదవిని అమ్ముకున్న వ్యక్తి అని జగన్ తెలిపారు. అలాంటి వ్యక్తి లిక్కర్ పై చేసే ఆరోపణలకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. మరో నిందితుడిగా చెప్తున్నరాజ్ కెసిరెడ్డికీ బేవరేజెస్ కార్యకలాపాలకూ ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఐటీ రంగంలో అనుభవం ఉన్న వ్యాపారవేత్త, సలహాదారుల్లో ఒకడైన రాజ్ తమకు లొంగకపోవడం వల్ల నిందితుడిగా మార్చారన్నారు.