అక్కినేని అఖిల్ పెళ్లి డేట్ ఫిక్స్ ..

akkil-27.jpg

అక్కినేని హీరో అఖిల్ సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అవుతున్నప్పటికీ సరైనా హిట్ ఒక్కటి కూడా పడలేదు. దీంతో ప్రస్తుతం నటిస్తున్న ‘లెనిన్’ చిత్రంపైనే అక్కినేని ఫ్యాన్స్ తమ ఆశలను పెట్టుకున్నారు. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడుతున్నాడు. అలాగే తన లుక్ కూడా మొత్తం చేంజ్ చేసి వావ్ అనిపిస్తున్నాడు. ఇక ‘లెనిన్’ సినిమాతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తనకు కాబోయే భార్యతో మాత్రం అప్పుడప్పుడు కనిపిస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు.

అఖిల్‌కు బిజినెస్ మ్యాన్ కూతురు అయినటువంటి జైనాబ్ రవడ్జీతో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై అక్కినేని నాగార్జున అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా ఇవ్వడంతో ఇక అఖిల్ పెళ్లి జరుగుతుందా అంటూ అక్కినేని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ పెళ్లికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఏడాది జూన్ 6 న అఖిల్ పెళ్లి జరగబోతున్నట్లు నెట్టింట వార్తలు హాట్ హాట్‌గా వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు రాబోతున్నట్లు వైరల్ అవుతోన్న పోస్ట్‌తో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు.

Share this post

scroll to top