పెళ్లి ముహూర్తంపై నారా రోహిత్ అధికారిక ప్రకటన..

rohit-31.jpg

నారా రోహిత్‌ తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చాడు నారా రోహిత్‌. నారా రోహిత్‌ సిరిలేళ్ల శిరీషా నిశ్చితార్థం గతేడాది అక్టోబర్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ అలాగే కుటుంబ సభ్యుల సమక్షంలో ఉంగరాలు మార్చకున్నారు. నిజం చెప్పాలంటే ఇప్పటికే నారా రోహిత్‌ పెళ్లి ఇప్పటికే జరగాల్సి ఉంది. అయతే నారా రోహిత్ తండ్రి రామ్మూర్తి నాయుడు నవంబర్ లో కన్నుమూశారు. దీంతో తమ పెళ్లి వేడుకను వాయిదా వేసుకున్నాడు నారా రోహిత్. అయితే త్వరలోనే శిరీషతో ఏడడుగులు నడవనున్నట్లు వెల్లడించాడు హీరో. ఈ ఏడాది అక్టోబర్‌లో సిరితో తన పెళ్లి చేసుకోబోతున్నట్టు రోహిత్ అధికారికంగా ప్రకటించాడు. హిందు సంప్రదాయం ప్రకారం అప్పటికి తన పెళ్లికి లైన్ క్లియర్ అవుతుందని నారా వారి హీరో చెప్పుకొచ్చాడు.

Share this post

scroll to top