సీఎం చంద్రబాబుతో అక్కినేని నాగార్జున భేటీ..

nag-03.jpg

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు సినీ హీరో అక్కినేని నాగార్జున. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి వెళ్లిన నాగార్జున ఆయనతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తన చిన్నకుమారుడు అక్కినేని అఖిల్‌ వివాహ ఆహ్వానపత్రికను సీఎం చంద్రబాబుకు అందజేసిన నాగార్జున తన కుమారుడి పెళ్లి రావాలంటూ ఆహ్వానించారు.

ఈ నెల 6వ తేదీన అక్కినేని అఖిల్ జైనబ్‌ వివాహం నిర్వహించబోతున్నారు. జైనబ్ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయి. కొన్ని ఏళ్లుగా అఖిల్‌తో ప్రేమలో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సహా పలువురు ప్రముఖులను కలిసి అక్కినేని నాగార్జున ఆహ్వానించిన విషయం విదితమే ఇక, హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో అఖిల్ – జైనబ్‌ వివాహం జరగనున్నట్టుగా తెలుస్తుండగా ఆ త‌ర్వాత రాజ‌స్థాన్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ ప్లాన్ చేశారని సమాచారం.

Share this post

scroll to top