కేజ్రీవాల్‌ బెయిల్‌పై తీర్పు రిజర్వ్‌..

delhi-20-.jpg

ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పిటిషన్‌పై తీర్పును రౌస్‌ అవెన్యూ కోర్టు రిజర్వ్‌ చేసింది. కాగా, ఢిల్లీ లిక్కర్‌ పాలసీలో మనీలాండరింగ్‌ కేసులో బెయిల్‌ కోరుతూ కేజ్రీవాల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. కాగా, కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు రౌస్‌ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఈడీ వాదనలు వినిపిస్తూ లిక్కర్‌ స్కాం కేసులో కేజ్రీవాల్‌ పాత్ర ఉందని స్పష్టం చేసింది. అలాగే, కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయని, ఈ కేసు దర్యాప్తునకు ఆయన సహకరించడంలేదని తెలిపింది. ఈ సందర్భంగా కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొదని కోర్టును కోరింది.

Share this post

scroll to top