ఎన్నికల వేళ మాత్రమే కనిపించే నేతల కప్పదాట్లు.. ఇప్పుడు ఎన్నికల తరువాత కూడా కనిపిస్తోంది. తెలంగాణలో అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీనుంచి వరుసగా వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి.. బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నేతల వ్యతిరేకత నేపథ్యంలో నిన్నమొన్నటి వరకు ఊగిసలాడిన కృష్ణ మోహన్ రెడ్డి.. శనివారం నాడు నేరుగా సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఇన్‌ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ ఇద్దరూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు.. మరో ఎమ్మెల్యే జంప్..
