ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన సీబీఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. లిక్కర్ కేసులో కవిత పాత్ర పై సీబీఐ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌ను పరిగణలోకి తీసుకునే అంశం, సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై విచారణ జూలై 22 వాయిదా వేసింది. కోర్టులో వాదనలు సందర్భంగా.. సీబీఐ చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా పేర్కొన్నారు. దీనిపై సీబీఐ న్యాయవాది స్పందిస్తూ తప్పులు లేవని చెప్పారు. చార్జ్‌షీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేశారా అని జడ్జి కావేరి భవేజా ప్రశ్నించారు. చార్జ్‌షీట్‌లో తప్పులుంటే కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని తెలిపారు. అయితే కోర్టు ఆర్డర్ అప్ లోడ్ కాలేదని నితీష్ రాణా తెలిపారు.
లిక్కర్ స్కాం సీబీఐ కేసులో కవిత విచారణ వాయిదా..
