మంత్రి కోమటిరెడ్డి కాళ్లు మొక్కిన అద్దంకి దయాకర్..

dhyakae-13.jpg

టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ హీరోగా నటించిన లేటేస్ట్ చిత్రం ‘ఇండియా ఫైల్స్’. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ఆడియో రిలీజ్ వేడుక నిర్వహించారు. ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్‌కు కాంగ్రెస్ కీలక నేత, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతూ అద్దంకి దయాకర్‌పై ప్రశంసలు కురిపించాడు. అన్ని విషయాలపై అహగాహన ఉన్న నాయకుడు అద్దంకి దయాకర్ అని కొనియాడారు. దురదృష్టవశాత్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో అవకాశం దక్కలేదని.. కానీ ఆయన భవిష్యత్‌లో పెద్ద లీడర్ అవుతాడని ప్రశసించాడు. ఈ క్రమంలో అద్దంకి దయాకర్ మంత్రి కోమటిరెడ్డి కాళ్లకు నమస్కరించారు. ఈ సీన్ ఆ ఆడియో ఫంక్షన్ మొత్తంలో హైలెట్‌గా నిలిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అద్దంకి దయాకర్ పరుష పదజాలంతో తిట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అప్పట్లో టీ-కాంగ్రెస్‌లో పెను దుమారమే రేపగా దయాకర్ తరుఫున కోమటిరెడ్డికి స్వయంగా రేవంత్ రెడ్డి స్వారీ చెప్పారు.

Share this post

scroll to top