గత మూడు టరమ్‌లలో కన్నా ఈ విడత ఆయన పాలన తీరు మరీ నాసిరకంగా మారుతోందని చెప్పడానికి బాధ కలుగుతోంది. గతంలో కూడా అలవికాని వాగ్దానాలు చేసి, వాటిని అమలు చేయకుండా ఉన్నప్పటికీ, పాలన మరీ ఇంత అద్వాన్నంగా లేదని చెప్పాలి. ప్రత్యేకించి గత నెల రోజుల పాలనలో జరిగినన్ని అరాచకాలు ఇంతకు ముందెన్నడూ చూడనివి. ఆ రోజుల్లో ప్రజలు ఏమైనా అనుకుంటారేమోనని వెరచేవారు. ఇప్పుడు చంద్రబాబులో ఆ వెరపు పోయినట్లయింది. జనాన్ని మాయచేయగలిగాం కాబట్టి ఎవరేం చేయలేరు అన్న అహంభావ ధోరణిలోకి వెళ్లి ఉండాలి. లేదా ఆయనకు సంబంధం లేకుండా పాలన సాగుతుండాలి. పూర్వం కూడా పోలీసులను ఆయన రాజకీయ ప్రయోజనాలకు వాడుకున్నా, మరీ ఇంతలా ప్రత్యర్దులను వేధించడానికి వినియోగించుకున్నారని చెప్పజాలం.
ఇంత అధ్వానమా..
