ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ..

ktr-16-2.jpg

ఓ వైపు ఫిరాయింపులు.. మరోవైపు ప్రొటోకాల్ రగడ.. ఈ రెండు విషయాలపై బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పై మండిపడుతోంది.. ఈ క్రమంలోనే.. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కు ఫిర్యాదు చేసింది.. పిటిషన్ల మీద నిర్ణయం తీసుకునే అధికారం స్పీకర్‌కే ఉందని.. వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ స్పీకర్‌ని కోరారు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని కోర్టులు చెప్తున్నాయి. అలా జరగని పక్షంలో కోర్టులు జోక్యం చేసుకుంటాయి. అంతవరకూ తెచ్చుకోవద్దంటూ స్పీకర్‌కి విన్నవించుకున్నట్లు కేటీఆర్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు స్పీకర్ తెచ్చుకోవద్దంటూ సూచించారు.

Share this post

scroll to top