వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని, నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్టఅని ట్వీట్‌లో పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతపై చంద్రబాబు సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. అర్ధరాత్రి నుంచే వైఎస్ జగన్‌కు భద్రతను తగ్గించింది అని అంటున్నారు. వినుకొండ వెళ్తున్న YS జగన్ కాన్వాయ్పై పోలీసులు ఆంక్షలు విధించారని YCP ఆరోపించింది. మాజీ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు జగన్ వెంట వెళ్లకుండా వారి కార్లను తాడేపల్లి, మంగళగిరి, గుంటూరులో ఆపేశారని తెలిపింది. ఇన్నాళ్లు ఉన్న బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని తొలగించి, సరిగ్గా నడవని వాహనం ఇచ్చారని మండిపడింది. అది బాగోలేదని తన ప్రైవేట్ వాహనంలో జగన్ వినుకొండకు వెళ్తున్నట్లు YCP పేర్కొంది.
ప్రైవేట్ వాహనంలో వినుకొండకు జగన్
