జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదన్నారు.

ktr-19.jpg

జూన్‌లో వేయాల్సిన రైతు భరోసా జూలై వచ్చినా రైతుల ఖాతాలో వెయ్యలేదన్నారు. కౌలు రైతులకు ఇస్తానన్న రూ.15 వేలు ఇయ్యనే ఇయ్యలేదన్నారు. రైతు కూలీలకు రూ.12 వేల హామీ ఇంకా అమలు చెయ్యలేదని మంత్రి కేటీఆర్ విమర్శించారు. ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలు.. రైతుమాఫీ పథకానికి మరణ శాసనాలయ్యాయని కేటీఆర్ పేర్కొన్నారు. అన్నివిధాలా అర్హత ఉన్నా కూడా ఎందుకు రుణమాఫీ కాలేదో చెప్పెటోడు లేడన్నారు. రైతులు గోడు చెప్పుకుందామంటే వినేటోడు లేడని కేటీఆర్ అన్నారు. అర్హులైన లబ్దిదారులు రుణమాఫీ కాక అంతులేని ఆందోళనలో ఉంటే మీరు మాత్రం సంబరాలు చేసుకుంటారా? ఎందుకీ సంబరాలు? అని నిలదీశారు. నలభై లక్షల మందిలో మెజారిటీ రైతులకు నిరాశే మిగిల్చినందుకా ? ముప్ఫై లక్షల మందిని మోసం చేసినందుకా?’ ఎందుకీ సంబరాలని కేటీఆర్ నిలదీశారు. రెండు సీజన్లు అయినా రైతు భరోసా ఇంకా షురూ చెయ్యలేదని అన్నారు.

Share this post

scroll to top