విశ్వనగరంగా హైదరాబాద్ మరింత అభివృద్ధి..

cm-ravanbth-20.jpg

విశ్వనగరంగా హైదరాబాద్ ను తీర్చిదిద్ధినప్పుడే ఇక్కడ మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు వచ్చాక గోపన్ పల్లి లాంటి ప్రాంతాలు ఎంతో ప్రగతి సాధించాయని, ఇక్కడ ఎకరా రూ.100 కోట్లు పలుకుతుందని అన్నారు. మూసీని చూస్తే లండన్ ను తలపించాలని అన్నారు. మూసీ అభివృద్ధిని చూస్తేనే ప్రజా ప్రభుత్వం గుర్తుకు వచ్చేలా తీర్చిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి నగర అభివృద్ధికి మరింత చేయూతనిచ్చేలా ఉన్నతంగా తీర్చిదిద్దుతామని సీఎం అన్నారు. మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఎక్కడ అభివృద్ధి ఆగకుండా మరిన్ని నిధులు ఇచ్చి అభివృద్ధి చేస్తాం అన్నారు. ఈ ప్రాంతం నుండే రాష్ట్రానికి ఎక్కువగా ఆదాయం సమకూరుతుందని, దేశం నుండి ఎక్కడెక్కడి నుండో వచ్చి ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని అన్నారు. అవసరమైన చోట కొత్త రోడ్లను ఏర్పాటు చేస్తామని ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నాయకులు జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ చైర్మన్ జెరిపేటి జైపాల్, రఘునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Share this post

scroll to top