ఈ రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సమయంలో “హత్యా రాజకీయాలు ఆపాలి.. సేవ్ డెమోక్రసీ” అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ నల్లకండువాలు ధరించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఏపీ అసెంబ్లీలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు మాజీ సీఎం జగన్ వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్ అంటూ జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి పలకరించారు. ఈ సమావేశాలు జరిగినన్న రోజు అసెంబ్లీకి రావాలని జగన్‌ను కోరారు. తనకు జగన్ ప్రక్కనే సీట్ వేయించాలని పయ్యావుల కేశవ్‌ను కోరినట్లు రఘురామ కృష్ణ రాజు తెలిపారు. తప్పని సరిగా అంటూ లాబీల్లో నవ్వుకుంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి కేశవ్ వెళ్లినట్లు తెలిసింది. కొన్ని నిమిషాల పాటు ఆసక్తికర చర్చ జరిగింది.
జగన్ దగ్గరకు రఘురామ కృష్ణంరాజు..
