అన్నదాతల కుటుంబాలకు అండగా నిలిచే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవిత బీమా బెనిఫిట్ ఉంది. చాలా మంది ఇప్పటికే ఈ స్కీమ్‌లో చేరారు. అయితే ఇటీవల కాలంలో భూములు కొనుగోలు చేసిన వారు ఈ స్కీమ్ ప్రయోజనాలు పొందలేక పోవచ్చు. అలాగే వారసత్వంగా భూములు పొందిన వారికి కూడా ఈ బెనిఫిట్ ఉండకపోవచ్చు. అంటే కొత్తగా పాస్ బుక్ లు పొందిన వారు రైతు బీమా పథకంలో చేరి ఉండకపోవచ్చు. రేవంత్ సర్కార్ ఇలాంటి వారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 2024 జూలై 28 లోపు కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకాలు పొందేవారి నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అందువల్ల ఇలాంటి వారు రైతు బీమా కోసం పథకంలో చేరొచ్చు. 2024 ఆగస్ట్ 5 లోపు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం అందించే బీమా సౌకర్యం లేని ప్రతి రైతు కూడా దరఖాస్తు చేసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
రైతులకు 5 లక్షలు స్కీమ్..
