పారిస్ ఒలింపిక్స్‌లో 5వ‌ రోజు భారత షెడ్యూల్..

volumpics-31-.jpg

పారిస్ ఒలింపిక్స్‌లో భార‌త క్రీడాకారులు స‌త్తా చాటుతున్నారు. మనుబాకర్-సరబ్‌జోత్ అందించిన కాంస్య ప‌త‌క ఉత్సాహంతో ఐదో రోజైన పోటీల‌కు క్రీడాకారులు మ‌రింత ప‌ట్టుద‌ల‌తో బ‌రిలోకి దిగుతున్నారు. వీరిలో తెలుగు అమ్మాయిలు అయిన.. స్టార్ షట్లర్ పీవీ సింధు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఆకుల శ్రీజ కూడా ఉన్నారు. అంతేకాకుండా మనిక బత్రా టేబుల్ టెన్నిస్ ప్రీ-క్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించగా, టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మహిళా బాక్సర్ లోవ్లినా బోర్గోహై కూడా తన ప్రచారాన్ని ప్రారంభించనుంది. నేడు షూటింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, ఆర్చరీ, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్ క్రీడల్లో మన క్రీడాకారులు రంగంలోకి ద‌గ‌నున్నారు.

Share this post

scroll to top