శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పెన్నా నదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు, రవాణా సాగు తున్నాయి. ఈ క్రమంలో పొదలకూరు మండలం విరు వూరు గ్రామంలో గురువారం రాత్రి టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తుండగా గ్రామస్తులు అడ్డుకున్నారు. 50 ట్రాక్టర్లను నిలిపివేసి గొడవ చేయడంతో అందులో ఉన్నవారు వాటిని వది లేసి పరారయ్యారు. ఇక్కడ ఇసుక తోడితే పర్యావరణా నికి ముప్పు ఏర్పడి మేకపాటి గౌతంరెడ్డి బ్యారేజీ ఉని కికే ప్రమాదమని స్థానికులు ఆందోళనకు దిగి అక్రమా ర్కులను తరిమేశారు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చం ద్రమోహన్రెడ్డి అండతోనే అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు ప్రజలు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు, పల్లిపాడు, మినగల్లు స్టాక్ యార్డుల నుంచి టీడీపీ నేతలు తమ ఇష్టపకారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారు. 20 టన్నుల ఇసుకకు డబ్బులు చెల్లించి 40 టన్నులు లోడ్ చేయిస్తున్నారు. వారి ఆగడాలతో దూర ప్రాంతాల నుంచి స్టాక్ యార్డు లకు ఇసుక కోసం వెళ్లిన లారీలు ఒకటి, రెండు రోజులు పడిగాపులు పడాల్సివస్తోంది.
నెల్లూరు జిల్లాలో అక్రమ తవ్వకాలపై జనం ఆగ్రహం..
