తెలంగాణ క్యాబినెట్ విస్తరణ..

ravanth-13.jpg

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవుల భర్తీతోపాటు పార్టీ పోస్టుల కోసం నేతలు ఎదురుచూస్తున్నారు. ఆశల పల్లకిలో విహరిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల ముందే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందని నేతలు అశించారు. అయితే సామాజిక సమీకరణలపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో వాయిదా పడింది. ఇంతలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం విదేశీ పర్యటనకు వెళ్లడంతో మరింత గ్యాప్ వచ్చింది. ఇక తాజాగా మరోసారి పదవుల పందారంపై కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది. సీఎం రేవంత్‌ రెడ్డి కేబినెట్‌లో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. నెల రోజుల క్రితమే సీఎం రేవంత్‌ ఢిల్లీకి వెళ్లడం, కాంగ్రెస్‌ సీనియర్లు కూడా హస్తినకు వెళ్లడంతో మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. అయితే కూడికలు తీసివేతలు ఓ కొలిక్కి రాలేదో ఏమో గానీ ఆషాఢం ఆశలకు ఫుల్‌ స్టాప్‌ పడింది. శ్రావణంలో మంత్రి వర్గం విస్తరణ చేద్దాం, అప్పుడే చూద్దాం అని అధిష్టానం చెప్పడంతో ఈ ఆశలకు టెంపరరీగా కామా పడింది. ఇంతలో రేవంత్ ఫారిన్ టూర్‌తో కొంత జాప్యం జరిగింది. అయితే, నాలుగు మంత్రి పదవులు మాత్రమే ఇప్పుడు భర్తీ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Share this post

scroll to top