పంచాయతీలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. మరో పదకొండు వందల కోట్ల రూపాయలను విడుదల చేయబోతున్నట్లు ఆయన ప్రకటించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని స్వర్ణ వానపల్లి గ్రామ సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఈ ఏడాది నరేగా పనుల కింద 4,500 కోట్ల అనుమతి తీసుకున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సారి ఇన్ని సభలు నిర్వహించడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అని చంద్రబాబు అన్నారు. పంచాయతీ రాజ్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాను, పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడమే తమ ముందున్న కర్తవ్యమని అన్నారు. నరేగా కింద ఏడాదికి 84 లక్షల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందని, వంద రోజులు పని కల్పించే బాధ్యతను తీసుకుంటామని తెలిపారు.