పవన్ కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారా..

og-27.jpg

పవన్‌ మళ్లీ సెట్స్‌పైకి ఎప్పుడు వెళ్లనున్నారన్న దానిపై చర్చ మొదలైంది. పవన్ చేతిలో ప్రస్తుతం హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ చిత్రాలు ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ మూడు చిత్రాలను కచ్చితంగా పూర్తి చేస్తానని పవన్‌ ఇప్పడకే హామీ ఇచ్చారు. అయితే తర్వాత కొత్త సినిమాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే తాజ సమాచారం ప్రకారం పవన్‌ మళ్లీ షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుదీప్‌ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ చిత్రాన్ని తొలుత పూర్తి చేయాలనే ఆలోచన ఉన్నట్లు సమాచారం.

అయితే పవన్‌ కళ్యాణ్‌కు సౌలభ్యంగా ఉండేందుకు దర్శకుడు సుజిత్‌ విజయవాడలోనే ముంబయికి సంబంధించిన షూటింగ్ ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగానే విజయవాడలో భారీ సెట్‌ను ఏర్పాటు నిర్మించేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. విజయవాడకు సంబంధించిన సన్నివేశాలను అవుట్ డోర్‌లో నిర్వహించి, ముంబయికి సంబంధించిన సన్నివేశాలను సెట్స్‌లో పూర్తి చేయాలని భావిస్తున్నారు. వారానికి రెండు రోజులు మాత్రమే పవన్ డేట్స్‌ కేటాయించినట్లు సమాచారం. 

Share this post

scroll to top