తణుకులోని అన్న క్యాంటీన్లలో ప్లేట్లను అపరిశుభ్రమైన నీటిలో కడుగుతున్న ఒక వీడియో సోషల్‌మీడియాలో తాజాగా వైరల్‌గా మారింది. దీంతో ఎన్‌ఆర్‌ఐ డాక్టర్ ప్రదీప్ రెడ్డి చింతా ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్లేట్లను సింక్‌లో కడుగుతున్న వీడియోను పోస్టు చేస్తూ మెడలు రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడ ఉన్నాయని సాయిధరమ్ తేజ్‌ను ప్రశ్నించారు. మీ సేఫ్ హ్యాండ్స్‌తో అన్న క్యాంటీన్లలో ప్లేట్లు కడగొచ్చు కదా అని సెటైర్ వేశారు. దీనికి మెగా హీరో సాయిధరమ్ తేజ్ కూడా స్పందించారు. దీంతో డాక్టర్ గారు మీరు ఎక్కడ ఉంటారని ప్రశ్నించారు. దానికి బయో చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. తాను చిన్న పిల్లలతో జాగ్రత్తగా ఉంటానని వారితో మర్యాదగా ప్రవర్తిస్తానని చెప్పారు. మైనర్లతో ఆడల్ట్ కంటెంట్, రొమాంటిక్ సన్నివేశాల్లో నటింపజేయడం మానేయాలని సూచించారు. తాను ఆచరించేదే ఇతరులకు బోధిస్తానని సెటైర్ వేశారు. డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఇచ్చిన కౌంటర్‌తో సాయిధరమ్ తేజ్ సైలెంట్ అయిపోయారు.
సేఫ్ హ్యాండ్స్ వచ్చి అన్న క్యాంటీన్‌లో ప్లేట్లు కడగొచ్చు కదా..
